Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #58 Translated in Telugu

وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنْكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْ بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَحِيمٌ
మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీ వద్దకు వచ్చినపుడు నీవు వారితో ఇలా అను: మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. నిశ్చయంగా, మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పు చేసి, ఆ తరువాత పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటే! నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ
మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి, మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము
قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ ۚ قُلْ لَا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ
ఇలా అను: నిశ్చయంగా అల్లాహ్ ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను." మరియు ఇలా అను: నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్తవానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను
قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّي وَكَذَّبْتُمْ بِهِ ۚ مَا عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ
ఇలా అను: నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాకరించారు. మీరు తొందర పెట్టే విషయం నా దగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు. మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి
قُلْ لَوْ أَنَّ عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
ఇలా అను: ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి నట్లయితే, నాకూ మీకూ మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు

Choose other languages: