Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #108 Translated in Telugu

قَدْ جَاءَكُمْ بَصَائِرُ مِنْ رَبِّكُمْ ۖ فَمَنْ أَبْصَرَ فَلِنَفْسِهِ ۖ وَمَنْ عَمِيَ فَعَلَيْهَا ۚ وَمَا أَنَا عَلَيْكُمْ بِحَفِيظٍ
వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు. మరియు నేను మీ రక్షకుడను కాను."(అని అను)
وَكَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ وَلِيَقُولُوا دَرَسْتَ وَلِنُبَيِّنَهُ لِقَوْمٍ يَعْلَمُونَ
మరియు వారు (అవిశ్వాసులు): నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు." అని అనాలనీ మరియు తెలివి గలవారికి (సత్యాన్ని) స్పష్టపరచుటకూను, మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము
اتَّبِعْ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ رَبِّكَ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) అనుసరించు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ సాటి (భాగస్వాములను) కల్పించే వారి నుండి విముఖుడవగు
وَلَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنْتَ عَلَيْهِمْ بِوَكِيلٍ
మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు. మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు (కార్యకర్తవు) కావు
وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِنْ دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ مَرْجِعُهُمْ فَيُنَبِّئُهُمْ بِمَا كَانُوا يَعْمَلُونَ
మరియు - అల్లాహ్ ను వదలి వారు ప్రార్థిస్తున్న ఇతరులను (వారి దైవాలను) - మీరు దూషించకండి. ఎందుకంటే, వారు ద్వేషంతో, అజ్ఞానంతో అల్లాహ్ ను దూషించ వచ్చు! ఈ విధంగా మేము ప్రతి జాతికి, వారి కర్మలు (ఆచారాలు) వారికి ఆకర్షణీయంగా కనబడేటట్లు చేశాము. తరువాత వారి ప్రభువు వైపునకు వారి మరలింపు ఉంటుంది; అప్పుడు వారికి వారి చేష్టలు తెలుపబడతాయి

Choose other languages: