Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #25 Translated in Telugu

إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُمْ بِعَذَابٍ أَلِيمٍ
నిశ్చయంగా, అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉందని తెలియజెయ్యి
أُولَٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُمْ مِنْ نَاصِرِينَ
అలాంటి వారి కర్మలు ఇహలోక మందును మరియు పరలోక మందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِنْهُمْ وَهُمْ مُعْرِضُونَ
ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి మధ్య తీర్పు చేయటానికి, అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని, వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గం వారు విముఖులై, వెనుదిరిగి పోతారు
ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَنْ تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِمْ مَا كَانُوا يَفْتَرُونَ
వారు అలా చేయటానికి కారణం వారు: నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది
فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశ పరచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు

Choose other languages: