Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #26 Translated in Telugu

أُولَٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُمْ مِنْ نَاصِرِينَ
అలాంటి వారి కర్మలు ఇహలోక మందును మరియు పరలోక మందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِنْهُمْ وَهُمْ مُعْرِضُونَ
ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి మధ్య తీర్పు చేయటానికి, అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని, వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గం వారు విముఖులై, వెనుదిరిగి పోతారు
ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَنْ تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِمْ مَا كَانُوا يَفْتَرُونَ
వారు అలా చేయటానికి కారణం వారు: నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది
فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశ పరచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు
قُلِ اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَنْ تَشَاءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَاءُ وَتُعِزُّ مَنْ تَشَاءُ وَتُذِلُّ مَنْ تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఇలా అను: ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి! నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్ధుడవు

Choose other languages: