Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #164 Translated in Telugu

إِنْ يَنْصُرْكُمُ اللَّهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِنْ يَخْذُلْكُمْ فَمَنْ ذَا الَّذِي يَنْصُرُكُمْ مِنْ بَعْدِهِ ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకుంటారు
وَمَا كَانَ لِنَبِيٍّ أَنْ يَغُلَّ ۚ وَمَنْ يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడినవాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు
أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّهِ كَمَنْ بَاءَ بِسَخَطٍ مِنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ
ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం
هُمْ دَرَجَاتٌ عِنْدَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
అల్లాహ్ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు
لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِنْ أَنْفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ
వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు. మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు

Choose other languages: