Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #166 Translated in Telugu

أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّهِ كَمَنْ بَاءَ بِسَخَطٍ مِنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ
ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం
هُمْ دَرَجَاتٌ عِنْدَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
అల్లాహ్ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు
لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِنْ أَنْفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ
వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు. మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు
أَوَلَمَّا أَصَابَتْكُمْ مُصِيبَةٌ قَدْ أَصَبْتُمْ مِثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِنْدِ أَنْفُسِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా! అయితే ఇప్పుడు: ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?" అని అంటున్నారా? వారితో ఇలా అను: ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!" నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు
وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ
మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి

Choose other languages: