Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #62 Translated in Telugu

وَجَاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهُ مُنْكِرُونَ
మరియు యూసుఫ్ (జోసెఫ్) సోదరులు వచ్చి అతని ముందు ప్రవేశించారు. అతను వారిని గుర్తించాడు కాని వారు అతనిని గుర్తించ లేక పోయారు
وَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ قَالَ ائْتُونِي بِأَخٍ لَكُمْ مِنْ أَبِيكُمْ ۚ أَلَا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَأَنَا خَيْرُ الْمُنْزِلِينَ
మరియు అతను వారి సామగ్రిని సిద్ధపరచిన తరువాత వారితో అన్నాడు: మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి మీరు (మళ్ళీ వచ్చేటప్పుడు) నా వద్దకు తీసుకొని రండి. ఏమీ? నేను ఏ విధంగా నిండుగా కొలిచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసేవారిలో నేను ఉత్తముడను
فَإِنْ لَمْ تَأْتُونِي بِهِ فَلَا كَيْلَ لَكُمْ عِنْدِي وَلَا تَقْرَبُونِ
కాని మీరు అతనిని నా వద్దకు తీసుకొని రాకపోతే నా వద్ద మీకు ఎలాంటి (ధాన్యం) దొరకదు, అలాంటప్పుడు మీరు నా దరిదాపులకు కూడా రాకండి
قَالُوا سَنُرَاوِدُ عَنْهُ أَبَاهُ وَإِنَّا لَفَاعِلُونَ
వారు ఇలా అన్నారు: మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నిస్తాము. మరియు మేము అలా తప్పకుండా చేస్తాము
وَقَالَ لِفِتْيَانِهِ اجْعَلُوا بِضَاعَتَهُمْ فِي رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُونَهَا إِذَا انْقَلَبُوا إِلَىٰ أَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు (యూసుఫ్) తన సేవకులతో: వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు!" అని అన్నాడు

Choose other languages: