Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #65 Translated in Telugu

قَالُوا سَنُرَاوِدُ عَنْهُ أَبَاهُ وَإِنَّا لَفَاعِلُونَ
వారు ఇలా అన్నారు: మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నిస్తాము. మరియు మేము అలా తప్పకుండా చేస్తాము
وَقَالَ لِفِتْيَانِهِ اجْعَلُوا بِضَاعَتَهُمْ فِي رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُونَهَا إِذَا انْقَلَبُوا إِلَىٰ أَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు (యూసుఫ్) తన సేవకులతో: వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు!" అని అన్నాడు
فَلَمَّا رَجَعُوا إِلَىٰ أَبِيهِمْ قَالُوا يَا أَبَانَا مُنِعَ مِنَّا الْكَيْلُ فَأَرْسِلْ مَعَنَا أَخَانَا نَكْتَلْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు: నాన్నా! ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు, కావున ధాన్యం తేవాలంటే! నీవు మా తమ్ముణ్ణి (బెన్యామీన్ ను) మాతోపాటు పంపు మరియు నిశ్చయంగా, మేము అతనిని కాపాడుతాము
قَالَ هَلْ آمَنُكُمْ عَلَيْهِ إِلَّا كَمَا أَمِنْتُكُمْ عَلَىٰ أَخِيهِ مِنْ قَبْلُ ۖ فَاللَّهُ خَيْرٌ حَافِظًا ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ
(యఅఖూబ్) అన్నాడు: ఏమీ? నేను మిమ్మల్ని అతని విషయంలో - ఇది వరకు అతని సోదరుని విషయంలో నమ్మనట్లు - నమ్మాలా? వాస్తవానికి, అల్లాహ్ యే ఉత్తమ రక్షకుడు. ఆయనే కరుణించేవారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి
وَلَمَّا فَتَحُوا مَتَاعَهُمْ وَجَدُوا بِضَاعَتَهُمْ رُدَّتْ إِلَيْهِمْ ۖ قَالُوا يَا أَبَانَا مَا نَبْغِي ۖ هَٰذِهِ بِضَاعَتُنَا رُدَّتْ إِلَيْنَا ۖ وَنَمِيرُ أَهْلَنَا وَنَحْفَظُ أَخَانَا وَنَزْدَادُ كَيْلَ بَعِيرٍ ۖ ذَٰلِكَ كَيْلٌ يَسِيرٌ
మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితో అన్నారు: నాన్నా! (చూడండి) ఇంకేం కావాలి? మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. మరియు మేము మన ఇంటివారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము. మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాము. ఇంకా ఒక ఒంటె మోసే బరువు (ధాన్యం) కూడా ఎక్కువగా తీసుకొని రాగలము. ఇక అంత ధాన్యం కూడా (అదనంగా) సులభంగా లభిస్తుంది కదా

Choose other languages: