Quran Apps in many lanuages:

Surah Yunus Ayahs #71 Translated in Telugu

هُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَسْمَعُونَ
ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (సంపాదించటానికి) ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి
قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ هُوَ الْغَنِيُّ ۖ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ إِنْ عِنْدَكُمْ مِنْ سُلْطَانٍ بِهَٰذَا ۚ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా
قُلْ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
ఇలా అను: నిశ్చయంగా, అల్లాహ్ కు అబద్ధం అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందరు
مَتَاعٌ فِي الدُّنْيَا ثُمَّ إِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِيقُهُمُ الْعَذَابَ الشَّدِيدَ بِمَا كَانُوا يَكْفُرُونَ
ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ نُوحٍ إِذْ قَالَ لِقَوْمِهِ يَا قَوْمِ إِنْ كَانَ كَبُرَ عَلَيْكُمْ مَقَامِي وَتَذْكِيرِي بِآيَاتِ اللَّهِ فَعَلَى اللَّهِ تَوَكَّلْتُ فَأَجْمِعُوا أَمْرَكُمْ وَشُرَكَاءَكُمْ ثُمَّ لَا يَكُنْ أَمْرُكُمْ عَلَيْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوا إِلَيَّ وَلَا تُنْظِرُونِ
మరియు వారికి నూహ్ గాథను వినిపించు. అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు: నా జాతి సోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన (ఆయాత్) లను బోధించటం, మీకు బాధాకరమైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్ నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించినవారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏ మాత్రం వ్యవధి నివ్వకండి

Choose other languages: