Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #45 Translated in Telugu

قَالُوا سُبْحَانَكَ أَنْتَ وَلِيُّنَا مِنْ دُونِهِمْ ۖ بَلْ كَانُوا يَعْبُدُونَ الْجِنَّ ۖ أَكْثَرُهُمْ بِهِمْ مُؤْمِنُونَ
వారు (దేవదూతలు) జవాబిస్తారు: నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి, వీరు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలా మంది, వారిని (జిన్నాతులను) విశ్వసించే వారు
فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَفْعًا وَلَا ضَرًّا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ النَّارِ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
(అప్పుడు వారితో ఇట్లనబడుతుంది): అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చుకోలేరు." మరియు మేము దుర్మార్గులతో: మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకబాధను రుచి చూడండి!" అని పలుకుతాము
وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَنْ يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وَقَالُوا مَا هَٰذَا إِلَّا إِفْكٌ مُفْتَرًى ۚ وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
మరియు వారికి మా స్పష్టమైన సూచన (ఆయాత్) లను వినిపింప జేసినప్పుడు వారు: ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు." అని అంటారు. వారింకా ఇలా అంటారు: ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే." మరియు సత్యతిరస్కారులు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు: ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!" అని అంటారు
وَمَا آتَيْنَاهُمْ مِنْ كُتُبٍ يَدْرُسُونَهَا ۖ وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِنْ نَذِيرٍ
(ఓ ముహమ్మద్!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే (సందేశహరుణ్ణి) కూడా పంపలేదు
وَكَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా) తిరస్కరించారు. మేము (పూర్వం) వారికిచ్చిన దానిలో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా! నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో

Choose other languages: