Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #45 Translated in Telugu

إِنَّ الَّذِينَ كَفَرُوا بِالذِّكْرِ لَمَّا جَاءَهُمْ ۖ وَإِنَّهُ لَكِتَابٌ عَزِيزٌ
నిశ్చయంగా, తమ దగ్గరకు హితబోధ వచ్చినపుడు దానిని తిరస్కరించే వారే (నష్టపోయేవారు). మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) చాలా శక్తివంతమైన (గొప్ప) గ్రంథం
لَا يَأْتِيهِ الْبَاطِلُ مِنْ بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ ۖ تَنْزِيلٌ مِنْ حَكِيمٍ حَمِيدٍ
అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని పైకి రాజాలదు. అది మహా వివేకవంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు, అయిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి అవతరింప జేయబడింది
مَا يُقَالُ لَكَ إِلَّا مَا قَدْ قِيلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ۚ إِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ وَذُو عِقَابٍ أَلِيمٍ
(ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు చెప్పబడిన దానిలో పూర్వం గతించిన ప్రవక్తలకు చెప్పబడనిది ఏదీ లేదు. నిశ్చయంగా, నీ ప్రభువు మాత్రమే క్షమాశీలుడు మరియు బాధాకరమైన శిక్ష విధించేవాడు కూడాను
وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ ۖ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ ۗ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ ۖ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى ۚ أُولَٰئِكَ يُنَادَوْنَ مِنْ مَكَانٍ بَعِيدٍ
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింప జేసి ఉండి నట్లైతే వారు ఇలా అని ఉండేవారు: దీని సూచనలు (ఆయాత్) స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (గ్రంథమేమో) అరబ్బేతర భాషలో మరియు (సందేశహరుడేమో) అరబ్బు?" వారితో ఇలా అను: ఇది (ఈ ఖుర్ఆన్) విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు స్వస్థత నొసంగేది. మరియు విశ్వసించనివారి చెవులకు అవరోధం మరియు వారి కళ్ళకు ఒక గంత. అలాంటి వారి స్థితి ఎంతో దూరం నుండి పిలువబడిన వారి అరుపులాంటిది
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۗ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِنْهُ مُرِيبٍ
వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, కాని దాని విషయంలో కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకవేళ నీ ప్రభువు నుండి, మొదటి నుంచే నిర్ణయం తీసుకోబడి ఉండక పోతే, వారి మధ్య ఎప్పుడో తీర్పు జరిగి వుండేది. మరియు నిశ్చయంగా, వారు దానిని గురించి ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు

Choose other languages: