Quran Apps in many lanuages:

Surah Fussilat Ayahs #18 Translated in Telugu

إِذْ جَاءَتْهُمُ الرُّسُلُ مِنْ بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ قَالُوا لَوْ شَاءَ رَبُّنَا لَأَنْزَلَ مَلَائِكَةً فَإِنَّا بِمَا أُرْسِلْتُمْ بِهِ كَافِرُونَ
ఇక దైవప్రవక్తలు వారి వద్దకు వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి వచ్చి: మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి!" అని అన్నప్పుడు, వారు ఇలా అన్నారు: మా ప్రభువే గనక కోరితే దేవదూతలను పంపి ఉండేవాడు. కావున మేము మీ ద్వారా పంపబడిన దానిని నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము
فَأَمَّا عَادٌ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَقَالُوا مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً ۖ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَهُمْ هُوَ أَشَدُّ مِنْهُمْ قُوَّةً ۖ وَكَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
ఇక ఆద్ వారి విషయం: వారు దురహంకారంతో భూమిలో అన్యాయంగా ప్రవర్తించే వారు. మరియు ఇలా అనేవారు: బలంలో మమ్మల్ని మించినవాడు ఎవడున్నాడు? ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, వారిని సృష్టించిన అల్లాహ్ బలంలో వారి కంటే ఎంతో మించినవాడని? అయినా వారు మా సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తూ ఉండేవారు
فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي أَيَّامٍ نَحِسَاتٍ لِنُذِيقَهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَخْزَىٰ ۖ وَهُمْ لَا يُنْصَرُونَ
చివరకు మేము వారికి, ఇహలోక జీవితంలోనే అవమానకరమైన శిక్ష రుచి చూపించాలని, అశుభమైని దినాలలో వారిపై తీవ్రమైన తుఫాను గాలిని పంపాము. మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో అవమానకరమైనదిగా ఉండబోతుంది. మరియు వారికెలాంటి సహాయం లభించదు
وَأَمَّا ثَمُودُ فَهَدَيْنَاهُمْ فَاسْتَحَبُّوا الْعَمَىٰ عَلَى الْهُدَىٰ فَأَخَذَتْهُمْ صَاعِقَةُ الْعَذَابِ الْهُونِ بِمَا كَانُوا يَكْسِبُونَ
మరియు సమూద్ వారి విషయం: మేము వారికి మార్గదర్శకత్వం చేశాము. కాని వారు మార్గదర్శకత్వానికి బదులు గ్రుడ్డితనాన్నే ఇష్టపడ్డారు. చివరకు వారి (దుష్ట) కర్మలకు ఫలితంగా, వారిపై పిడుగు లాంటి అవమానకరమైన శిక్ష పడింది
وَنَجَّيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
మరియు మేము వారిలో విశ్వాసులైన వారిని మరియు దైవభీతి గల వారిని రక్షించాము

Choose other languages: