Quran Apps in many lanuages:

Surah Fatir Ayahs #4 Translated in Telugu

الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ جَاعِلِ الْمَلَائِكَةِ رُسُلًا أُولِي أَجْنِحَةٍ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۚ يَزِيدُ فِي الْخَلْقِ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు. ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు
مَا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِنْ رَحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِنْ بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ (కారుణ్యాన్నైనా) ఆయన ఆపితే, ఆ తరువాత దానిని పంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు
يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు
وَإِنْ يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِنْ قَبْلِكَ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరించినా (ఇది క్రొత్త విషయం కాదు), వాస్తవానికి నీకు పూర్వం పంపబడిన సందేశహరులు కూడా తిరస్కరింపబడ్డారు. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) చివరకు అల్లాహ్ వద్దకే మరలింప బడతాయి

Choose other languages: