Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #65 Translated in Telugu

وَيُنَجِّي اللَّهُ الَّذِينَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ لَا يَمَسُّهُمُ السُّوءُ وَلَا هُمْ يَحْزَنُونَ
మరియు అల్లాహ్, భయభక్తులు గలవారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ వారిని ముట్టుకోదు మరియు వారు దుఃఖపడరు కూడా
اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త
لَهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో అలాంటి వారు. వారే! నష్టానికి గురి అయ్యే వారు
قُلْ أَفَغَيْرَ اللَّهِ تَأْمُرُونِّي أَعْبُدُ أَيُّهَا الْجَاهِلُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: ఓ మూర్ఖులారా! ఏమీ? అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధించమని, మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారా
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు

Choose other languages: