Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #99 Translated in Telugu

سَيَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ إِذَا انْقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ ۖ فَأَعْرِضُوا عَنْهُمْ ۖ إِنَّهُمْ رِجْسٌ ۖ وَمَأْوَاهُمْ جَهَنَّمُ جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ
(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం
يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۖ فَإِنْ تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللَّهَ لَا يَرْضَىٰ عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ
మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు
الْأَعْرَابُ أَشَدُّ كُفْرًا وَنِفَاقًا وَأَجْدَرُ أَلَّا يَعْلَمُوا حُدُودَ مَا أَنْزَلَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
وَمِنَ الْأَعْرَابِ مَنْ يَتَّخِذُ مَا يُنْفِقُ مَغْرَمًا وَيَتَرَبَّصُ بِكُمُ الدَّوَائِرَ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
وَمِنَ الْأَعْرَابِ مَنْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَتَّخِذُ مَا يُنْفِقُ قُرُبَاتٍ عِنْدَ اللَّهِ وَصَلَوَاتِ الرَّسُولِ ۚ أَلَا إِنَّهَا قُرْبَةٌ لَهُمْ ۚ سَيُدْخِلُهُمُ اللَّهُ فِي رَحْمَتِهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు. వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: