Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #74 Translated in Telugu

أَلَمْ يَأْتِهِمْ نَبَأُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَقَوْمِ إِبْرَاهِيمَ وَأَصْحَابِ مَدْيَنَ وَالْمُؤْتَفِكَاتِ ۚ أَتَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్, ఇబ్రాహీమ్ జాతి వారి, మద్ యన్ (షుఐబ్) ప్రజల మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)? వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు
وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనా పరుడు
وَعَدَ اللَّهُ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ وَرِضْوَانٌ مِنَ اللَّهِ أَكْبَرُ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
మరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి. వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)
يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం
يَحْلِفُونَ بِاللَّهِ مَا قَالُوا وَلَقَدْ قَالُوا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوا بَعْدَ إِسْلَامِهِمْ وَهَمُّوا بِمَا لَمْ يَنَالُوا ۚ وَمَا نَقَمُوا إِلَّا أَنْ أَغْنَاهُمُ اللَّهُ وَرَسُولُهُ مِنْ فَضْلِهِ ۚ فَإِنْ يَتُوبُوا يَكُ خَيْرًا لَهُمْ ۖ وَإِنْ يَتَوَلَّوْا يُعَذِّبْهُمُ اللَّهُ عَذَابًا أَلِيمًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَمَا لَهُمْ فِي الْأَرْضِ مِنْ وَلِيٍّ وَلَا نَصِيرٍ
మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాప పడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు

Choose other languages: