Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #69 Translated in Telugu

وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ
నీవు వారిని అడిగితే వారు తప్పక: మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడు తున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: ఏమీ? మీరు అల్లాహ్ తో మరియు ఆయన సూచనలతో (ఆయాత్ లతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా
لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ ۚ إِنْ نَعْفُ عَنْ طَائِفَةٍ مِنْكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు
الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُمْ مِنْ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمُنْكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا اللَّهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ
కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు. మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్)
وَعَدَ اللَّهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ هِيَ حَسْبُهُمْ ۚ وَلَعَنَهُمُ اللَّهُ ۖ وَلَهُمْ عَذَابٌ مُقِيمٌ
మరియు కపట విశ్వాసులైన పురుషులకు మరియు కపట విశ్వాసులైన స్త్రీలకు మరియు సత్యతిరస్కారులకు, అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్ వారిని శపించాడు (బహష్కరించాడు). మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది
كَالَّذِينَ مِنْ قَبْلِكُمْ كَانُوا أَشَدَّ مِنْكُمْ قُوَّةً وَأَكْثَرَ أَمْوَالًا وَأَوْلَادًا فَاسْتَمْتَعُوا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِي خَاضُوا ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడి నటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు! వీరే నష్టానికి గురి అయ్యేవారు

Choose other languages: