Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #58 Translated in Telugu

وَمَا مَنَعَهُمْ أَنْ تُقْبَلَ مِنْهُمْ نَفَقَاتُهُمْ إِلَّا أَنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَبِرَسُولِهِ وَلَا يَأْتُونَ الصَّلَاةَ إِلَّا وَهُمْ كُسَالَىٰ وَلَا يُنْفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ
మరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే
فَلَا تُعْجِبْكَ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُعَذِّبَهُمْ بِهَا فِي الْحَيَاةِ الدُّنْيَا وَتَزْهَقَ أَنْفُسُهُمْ وَهُمْ كَافِرُونَ
కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు! నిశ్చయంగా, అల్లాహ్ వాటి వలన వారిని, ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు
وَيَحْلِفُونَ بِاللَّهِ إِنَّهُمْ لَمِنْكُمْ وَمَا هُمْ مِنْكُمْ وَلَٰكِنَّهُمْ قَوْمٌ يَفْرَقُونَ
మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు
لَوْ يَجِدُونَ مَلْجَأً أَوْ مَغَارَاتٍ أَوْ مُدَّخَلًا لَوَلَّوْا إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ
ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు
وَمِنْهُمْ مَنْ يَلْمِزُكَ فِي الصَّدَقَاتِ فَإِنْ أُعْطُوا مِنْهَا رَضُوا وَإِنْ لَمْ يُعْطَوْا مِنْهَا إِذَا هُمْ يَسْخَطُونَ
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు. దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు

Choose other languages: