Quran Apps in many lanuages:

Surah At-Talaq Ayahs #11 Translated in Telugu

لِيُنْفِقْ ذُو سَعَةٍ مِنْ سَعَتِهِ ۖ وَمَنْ قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنْفِقْ مِمَّا آتَاهُ اللَّهُ ۚ لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا مَا آتَاهَا ۚ سَيَجْعَلُ اللَّهُ بَعْدَ عُسْرٍ يُسْرًا
సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చు పెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధి గల వ్యక్తి అల్లాహ్ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దాని కంటే మించిన భారం వేయడు. అల్లాహ్ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు
وَكَأَيِّنْ مِنْ قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِ فَحَاسَبْنَاهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَاهَا عَذَابًا نُكْرًا
మరియు ఎన్నో నగరవాసులు, తమ ప్రభువు మరియు ఆయన ప్రవక్తల ఆజ్ఞలను తిరస్కరించారు. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు వారికి తీవ్రమైన శిక్షను సిద్ధ పరిచాము
فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَاقِبَةُ أَمْرِهَا خُسْرًا
కావున వారు తమ వ్యవహారాల దుష్టఫలితాన్ని రుచి చూశారు. మరియు వారి వ్యవహారాల పర్యవసానం నష్టమే
أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ الَّذِينَ آمَنُوا ۚ قَدْ أَنْزَلَ اللَّهُ إِلَيْكُمْ ذِكْرًا
అల్లాహ్ వారి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కావున విశ్వాసులైన బుద్ధమంతులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వాస్తవానికి అల్లాహ్ మీ వద్దకు హితబోధను (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు
رَسُولًا يَتْلُو عَلَيْكُمْ آيَاتِ اللَّهِ مُبَيِّنَاتٍ لِيُخْرِجَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَمَنْ يُؤْمِنْ بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ قَدْ أَحْسَنَ اللَّهُ لَهُ رِزْقًا
ఒక ప్రవక్తను కూడా! అతను మీకు స్పష్టమైన అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వినిపిస్తున్నాడు. అది, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అంధకారాల నుండి వెలుగులోనికి తీసుకురావటానికి. మరియు అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అక్కడ వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. వాస్తవానికి అల్లాహ్ అలాంటి వ్యక్తి కొరకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాడు

Choose other languages: