Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #94 Translated in Telugu

إِلَّا الَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ أَوْ جَاءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَنْ يُقَاتِلُوكُمْ أَوْ يُقَاتِلُوا قَوْمَهُمْ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ ۚ فَإِنِ اعْتَزَلُوكُمْ فَلَمْ يُقَاتِلُوكُمْ وَأَلْقَوْا إِلَيْكُمُ السَّلَمَ فَمَا جَعَلَ اللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు
سَتَجِدُونَ آخَرِينَ يُرِيدُونَ أَنْ يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوا إِلَى الْفِتْنَةِ أُرْكِسُوا فِيهَا ۚ فَإِنْ لَمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوا إِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوا أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُولَٰئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَانًا مُبِينًا
మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతి వారితో కూడా శాంతి పొందాలని కోరుతుంటారు. కాని సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలి పోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరించక పోతే, తమ చేతులను (మీతో యుద్ధం చేయటం నుండి) ఆపు కోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము
وَمَا كَانَ لِمُؤْمِنٍ أَنْ يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَنْ قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ وَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَنْ يَصَّدَّقُوا ۚ فَإِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۖ وَإِنْ كَانَ مِنْ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ فَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۖ فَمَنْ لَمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِنَ اللَّهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
وَمَنْ يَقْتُلْ مُؤْمِنًا مُتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا
మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِنْدَ اللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنْتُمْ مِنْ قَبْلُ فَمَنَّ اللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు." అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును

Choose other languages: