Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #96 Translated in Telugu

وَمَا كَانَ لِمُؤْمِنٍ أَنْ يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَأً ۚ وَمَنْ قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ وَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ إِلَّا أَنْ يَصَّدَّقُوا ۚ فَإِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۖ وَإِنْ كَانَ مِنْ قَوْمٍ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِيثَاقٌ فَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَىٰ أَهْلِهِ وَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ ۖ فَمَنْ لَمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِنَ اللَّهِ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు
وَمَنْ يَقْتُلْ مُؤْمِنًا مُتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا
మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا ضَرَبْتُمْ فِي سَبِيلِ اللَّهِ فَتَبَيَّنُوا وَلَا تَقُولُوا لِمَنْ أَلْقَىٰ إِلَيْكُمُ السَّلَامَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا فَعِنْدَ اللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنْتُمْ مِنْ قَبْلُ فَمَنَّ اللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوا ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు." అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును
لَا يَسْتَوِي الْقَاعِدُونَ مِنَ الْمُؤْمِنِينَ غَيْرُ أُولِي الضَّرَرِ وَالْمُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ ۚ فَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ عَلَى الْقَاعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَفَضَّلَ اللَّهُ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ أَجْرًا عَظِيمًا
ఎలాంటి కారణం లేకుండా, ఇంటి వద్ద కూర్చుండిపోయే విశ్వాసులు మరియు అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసే విశ్వాసులతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసేవారి స్థానాన్ని అల్లాహ్! ఇంట్లో కూర్చుండి పోయే వారి స్థానం కంటే, ఉన్నతం చేశాడు. మరియు అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ అల్లాహ్ ధర్మయుద్ధం (జిహాద్) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారి కంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు
دَرَجَاتٍ مِنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
వారి కొరకు, ఆయన తరఫు నుండి ఉన్నత స్థానాలు, క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: