Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #82 Translated in Telugu

أَيْنَمَا تَكُونُوا يُدْرِكْكُمُ الْمَوْتُ وَلَوْ كُنْتُمْ فِي بُرُوجٍ مُشَيَّدَةٍ ۗ وَإِنْ تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِنْدِ اللَّهِ ۖ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هَٰذِهِ مِنْ عِنْدِكَ ۚ قُلْ كُلٌّ مِنْ عِنْدِ اللَّهِ ۖ فَمَالِ هَٰؤُلَاءِ الْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا
మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు." (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని అంటారు. కాని వారికేదైనా కీడు గలిగితే: (ఓ ముహమ్మద్!) ఇది నీ వల్ల జరిగింది." అని అంటారు. వారితో అను: అంతా అల్లాహ్ తరఫు నుండే (వస్తుంది)!" ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు
مَا أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللَّهِ ۖ وَمَا أَصَابَكَ مِنْ سَيِّئَةٍ فَمِنْ نَفْسِكَ ۚ وَأَرْسَلْنَاكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్ సాక్ష్యమే చాలు
مَنْ يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ ۖ وَمَنْ تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا
ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు
وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا مِنْ عِنْدِكَ بَيَّتَ طَائِفَةٌ مِنْهُمْ غَيْرَ الَّذِي تَقُولُ ۖ وَاللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
మరియు వారు (నీ సమక్షంలో): మేము విధేయులమయ్యాము." అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళి పోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పిన దానికి విరుద్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారి నుండి ముఖము త్రిప్పుకో మరియు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు
أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا
ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా

Choose other languages: