Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #57 Translated in Telugu

أَمْ لَهُمْ نَصِيبٌ مِنَ الْمُلْكِ فَإِذًا لَا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا
లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు
أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ ۖ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُمْ مُلْكًا عَظِيمًا
లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము
فَمِنْهُمْ مَنْ آمَنَ بِهِ وَمِنْهُمْ مَنْ صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا
కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు
إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا
నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَهُمْ فِيهَا أَزْوَاجٌ مُطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము; వారందులో, శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము

Choose other languages: