Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #59 Translated in Telugu

فَمِنْهُمْ مَنْ آمَنَ بِهِ وَمِنْهُمْ مَنْ صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا
కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు
إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا
నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَهُمْ فِيهَا أَزْوَاجٌ مُطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము; వారందులో, శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము
إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَنْ تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا حَكَمْتُمْ بَيْنَ النَّاسِ أَنْ تَحْكُمُوا بِالْعَدْلِ ۚ إِنَّ اللَّهَ نِعِمَّا يَعِظُكُمْ بِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا
పూచీలను (అమానాత్ లను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండనీ మరియు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండనీ, అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంత ఉత్తమమైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنْكُمْ ۖ فَإِنْ تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ إِنْ كُنْتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది

Choose other languages: