Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #176 Translated in Telugu

فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُمْ مِنْ فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنْكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُمْ مِنْ دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
కానీ, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి, గర్వం వహించేవారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు; మరియు వారు తమ కొరకు - అల్లాహ్ తప్ప ఇతర రక్షించే వాడిని గానీ, సహాయపడే వాడిని గానీ పొందలేరు
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمْ بُرْهَانٌ مِنْ رَبِّكُمْ وَأَنْزَلْنَا إِلَيْكُمْ نُورًا مُبِينًا
ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము
فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُسْتَقِيمًا
కావున ఎవరు అల్లాహ్ ను విశ్వసించి, ఆయననే దృఢంగా నమ్ముకుంటారో, వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తన వద్దకు చేరే ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
يَسْتَفْتُونَكَ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِنْ لَمْ يَكُنْ لَهَا وَلَدٌ ۚ فَإِنْ كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِنْ كَانُوا إِخْوَةً رِجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنْثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَنْ تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
వారు నిన్ను, (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్ మీకు, కలాలను గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసుడవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీమణులు ఉంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకులుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు

Choose other languages: