Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #116 Translated in Telugu

وَمَنْ يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُبِينًا
మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే
وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّتْ طَائِفَةٌ مِنْهُمْ أَنْ يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنْفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِنْ شَيْءٍ ۚ وَأَنْزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُنْ تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا
మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీ కెలాంటి హానీ చేయలేరు. మరియు అల్లాహ్ నీ పై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. మరియు నీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది
لَا خَيْرَ فِي كَثِيرٍ مِنْ نَجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ`అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్ ప్రీతి కొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము
وَمَنْ يُشَاقِقِ الرَّسُولَ مِنْ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసిన పిదప కూడా, ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గం గాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో! అతడు అవలంబించిన త్రోవ వైపునకే, అతనిని మరల్చుతాము మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَنْ يَشَاءُ ۚ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే

Choose other languages: