Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayah #11 Translated in Telugu

يُوصِيكُمُ اللَّهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنْثَيَيْنِ ۚ فَإِنْ كُنَّ نِسَاءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ إِنْ كَانَ لَهُ وَلَدٌ ۚ فَإِنْ لَمْ يَكُنْ لَهُ وَلَدٌ وَوَرِثَهُ أَبَوَاهُ فَلِأُمِّهِ الثُّلُثُ ۚ فَإِنْ كَانَ لَهُ إِخْوَةٌ فَلِأُمِّهِ السُّدُسُ ۚ مِنْ بَعْدِ وَصِيَّةٍ يُوصِي بِهَا أَوْ دَيْنٍ ۗ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِنَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు. మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరోభాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడోభాగం. మృతునికి సోదరసోదరీమణులు ఉంటే, తల్లికి ఆరోభాగం. (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

Choose other languages: