Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #71 Translated in Telugu

وَمِنْ ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِقَوْمٍ يَعْقِلُونَ
మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది
وَأَوْحَىٰ رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ
మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు: నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో
ثُمَّ كُلِي مِنْ كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِنْ بُطُونِهَا شَرَابٌ مُخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِلنَّاسِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِقَوْمٍ يَتَفَكَّرُونَ
తరువాత అన్నిరకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు." దాని కడుపు నుండి రంగు రంగుల పానకం (తేనే) ప్రసవిస్తుంది; అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది
وَاللَّهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنْكُمْ مَنْ يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ قَدِيرٌ
మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు
وَاللَّهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِي الرِّزْقِ ۚ فَمَا الَّذِينَ فُضِّلُوا بِرَادِّي رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَهُمْ فِيهِ سَوَاءٌ ۚ أَفَبِنِعْمَةِ اللَّهِ يَجْحَدُونَ
మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్న వారికి (బానిసలకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా

Choose other languages: