Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #74 Translated in Telugu

وَاللَّهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنْكُمْ مَنْ يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ قَدِيرٌ
మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు
وَاللَّهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِي الرِّزْقِ ۚ فَمَا الَّذِينَ فُضِّلُوا بِرَادِّي رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَهُمْ فِيهِ سَوَاءٌ ۚ أَفَبِنِعْمَةِ اللَّهِ يَجْحَدُونَ
మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్న వారికి (బానిసలకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా
وَاللَّهُ جَعَلَ لَكُمْ مِنْ أَنْفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُمْ مِنْ أَزْوَاجِكُمْ بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُمْ مِنَ الطَّيِّبَاتِ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ اللَّهِ هُمْ يَكْفُرُونَ
మరియు అల్లాహ్ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారా
وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ
మరియు వారు అల్లాహ్ ను వదలి ఆకాశాల నుండి గానీ, భూమి నుండి గానీ వారికి ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని మరియు కనీసం (సమకూర్చే) సామర్థ్యం కూడా లేని వారిని ఆరాధిస్తున్నారు
فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ
కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి. నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు

Choose other languages: