Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #22 Translated in Telugu

وَإِنْ تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ اللَّهَ لَغَفُورٌ رَحِيمٌ
మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
وَاللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ
మరియు అల్లాహ్ కు మీరు దాచేవి మరియు మీరు వెలిబుచ్చేవి అన్నీ తెలుసు
وَالَّذِينَ يَدْعُونَ مِنْ دُونِ اللَّهِ لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
మరియు ఎవరినైతే వారు (ప్రజలు), అల్లాహ్ ను వదలి ప్రార్థిస్తున్నారో, వారు ఏమీ సృష్టించలేరు మరియు స్వయంగా వారే సృష్టించబడి ఉన్నారు
أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణం లేనివారు. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు
إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۚ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُمْ مُنْكِرَةٌ وَهُمْ مُسْتَكْبِرُونَ
మీ ఆరాధ్య దైవం కేవలం (అల్లాహ్) ఒక్కడే! పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు (ఈ సత్యాన్ని) తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు

Choose other languages: