Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #25 Translated in Telugu

أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణం లేనివారు. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు
إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۚ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُمْ مُنْكِرَةٌ وَهُمْ مُسْتَكْبِرُونَ
మీ ఆరాధ్య దైవం కేవలం (అల్లాహ్) ఒక్కడే! పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు (ఈ సత్యాన్ని) తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు
لَا جَرَمَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ
నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా దురహంకారులంటే ఆయన ఇష్టపడడు
وَإِذَا قِيلَ لَهُمْ مَاذَا أَنْزَلَ رَبُّكُمْ ۙ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ
మరియు: మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని వారిని అడిగినప్పుడు, వారు: అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే!" అని జవాబిస్తారు
لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ ۙ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُمْ بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَاءَ مَا يَزِرُونَ
కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంతభాగాన్ని కూడా మోస్తారు. వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి

Choose other languages: