Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #82 Translated in Telugu

لُعِنَ الَّذِينَ كَفَرُوا مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు. ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం
كَانُوا لَا يَتَنَاهَوْنَ عَنْ مُنْكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించు కోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి
تَرَىٰ كَثِيرًا مِنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنْفُسُهُمْ أَنْ سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో అనేకులు సత్యతిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమ కొరకు ముందుగా చేసి పంపుకున్న నీచ కర్మల వలన అల్లాహ్ కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు
وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنْزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِنْهُمْ فَاسِقُونَ
ఒకవేళ వారు అల్లాహ్ నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్యతిరస్కారులనుతమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు)
لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُمْ مَوَدَّةً لِلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ
నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: నిశ్చయంగా, మేము క్రైస్తవులము." అని , అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు /విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్ బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు

Choose other languages: