Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #85 Translated in Telugu

وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنْزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِنْهُمْ فَاسِقُونَ
ఒకవేళ వారు అల్లాహ్ నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్యతిరస్కారులనుతమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు)
لَتَجِدَنَّ أَشَدَّ النَّاسِ عَدَاوَةً لِلَّذِينَ آمَنُوا الْيَهُودَ وَالَّذِينَ أَشْرَكُوا ۖ وَلَتَجِدَنَّ أَقْرَبَهُمْ مَوَدَّةً لِلَّذِينَ آمَنُوا الَّذِينَ قَالُوا إِنَّا نَصَارَىٰ ۚ ذَٰلِكَ بِأَنَّ مِنْهُمْ قِسِّيسِينَ وَرُهْبَانًا وَأَنَّهُمْ لَا يَسْتَكْبِرُونَ
నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: నిశ్చయంగా, మేము క్రైస్తవులము." అని , అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు /విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్ బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు
وَإِذَا سَمِعُوا مَا أُنْزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
మరియు వారు (కొందరు క్రైస్తవులు) ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిని (ఈ గ్రంథాన్ని) విన్నప్పుడు, సత్యాన్ని తెలుసు కున్నందుకు, వారి కళ్ళ నుండి కన్నీళ్ళు కారటం నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చే వారిలో వ్రాసుకో
وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَنْ يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ
మరియు మేము అల్లాహ్ మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వర్తనులతో చేర్చాలని మేము కోరుకుంటున్నాము
فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే

Choose other languages: