Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #80 Translated in Telugu

قُلْ أَتَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఇలా అను: ఏమీ? మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గానీ, లాభం గానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِنْ قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَنْ سَوَاءِ السَّبِيلِ
(ఇంకా) ఇలా అను: ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైన వారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు
لُعِنَ الَّذِينَ كَفَرُوا مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు. ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం
كَانُوا لَا يَتَنَاهَوْنَ عَنْ مُنْكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించు కోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి
تَرَىٰ كَثِيرًا مِنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنْفُسُهُمْ أَنْ سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో అనేకులు సత్యతిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమ కొరకు ముందుగా చేసి పంపుకున్న నీచ కర్మల వలన అల్లాహ్ కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు

Choose other languages: