Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #79 Translated in Telugu

مَا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انْظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انْظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)
قُلْ أَتَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఇలా అను: ఏమీ? మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గానీ, లాభం గానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِنْ قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَنْ سَوَاءِ السَّبِيلِ
(ఇంకా) ఇలా అను: ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైన వారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు
لُعِنَ الَّذِينَ كَفَرُوا مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు. ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం
كَانُوا لَا يَتَنَاهَوْنَ عَنْ مُنْكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించు కోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి

Choose other languages: