Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayah #110 Translated in Telugu

إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدْتُكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنْجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنْفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنْكَ إِذْ جِئْتَهُمْ بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్తవయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలును నీకు నేర్పాను. మరియు నీవు నా ఆజ్ఞతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారి పోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి. మరియు నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీలు సంతతి వారి వద్దకు వచ్చినపుడు, వారిలోని సత్యతిరస్కారులు: ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు!" అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను

Choose other languages: