Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #115 Translated in Telugu

وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి." వారన్నారు: మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలను అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు
إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَنْ يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّهَ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు (హవారియ్యూన్): ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా (ఏసూ) ఏమీ? నీ ప్రభువు మా కొరకు ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళెం దింపగలడా?" అని అడిగారు! దానికి (ఈసా): మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి!" అని అన్నాడు
قَالُوا نُرِيدُ أَنْ نَأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَنْ قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ
వారు: వాస్తవానికి, మేము దాని నుండి తిని, మా హృదయాలను తృప్తి పరచు కోవటానికి మరియు నీవు మాతో సత్యం పలికావని తెలుసు కోవటానికి మరియు దానిని గురించి మేము సాక్షులుగా ఉండటానికి, మేమిలా కోరుతున్నాము!" అని అన్నారు
قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّهُمَّ رَبَّنَا أَنْزِلْ عَلَيْنَا مَائِدَةً مِنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِنْكَ ۖ وَارْزُقْنَا وَأَنْتَ خَيْرُ الرَّازِقِينَ
దానికి మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు): ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటివాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరపు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమమైన ఉపాధి ప్రదాతవు!" అని ప్రార్థించాడు
قَالَ اللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَنْ يَكْفُرْ بَعْدُ مِنْكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَا أُعَذِّبُهُ أَحَدًا مِنَ الْعَالَمِينَ
(అప్పుడు) అల్లాహ్: నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంత వరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!" అని అన్నాడు

Choose other languages: