Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #111 Translated in Telugu

فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِنْ شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَمِنَ الظَّالِمِينَ
కాని, ఆ తరువాత ఆ ఇద్దరు (సాక్షులు) పాపం చేశారని తెలిస్తే! అప్పుడు మొదటి ఇద్దరి (సాక్ష్యం) వలన హక్కును కోల్పోయిన వారి (బంధువుల)లో నుండి ఇద్దరు, మొదటి వారిద్దరికి బదులుగా నిలబడి అల్లాహ్ పై శపథం చేసి ఇలా అనాలి: మా సాక్ష్యం వీరువురి సాక్ష్యం కంటే ఎక్కువ హక్కు గలది (సత్యమైనది). మరియు మేము ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆ విధంగా చేస్తే నిశ్చయంగా, అన్యాయపరులలో చేరి పోదుము గాక
ذَٰلِكَ أَدْنَىٰ أَنْ يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَنْ تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّهَ وَاسْمَعُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తాయని వారిని భయపెట్టటానికి ఉత్తమమైనది. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన ఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు
يَوْمَ يَجْمَعُ اللَّهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: మీకేమి జవాబు ఇవ్వబడింది?" అని అడిగితే! వారు: మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విషయాల జ్ఞానం గలవాడవు." అని పలుకుతారు
إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدْتُكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنْجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنْفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنْكَ إِذْ جِئْتَهُمْ بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్తవయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలును నీకు నేర్పాను. మరియు నీవు నా ఆజ్ఞతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారి పోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి. మరియు నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీలు సంతతి వారి వద్దకు వచ్చినపుడు, వారిలోని సత్యతిరస్కారులు: ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు!" అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను
وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి." వారన్నారు: మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలను అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు

Choose other languages: