Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #93 Translated in Telugu

وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు ప్రతివిధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. అయినా చాలామంది ప్రజలు సత్యతిరస్కారులు గానే ఉండిపోయారు
وَقَالُوا لَنْ نُؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنْبُوعًا
మరియు వారు ఇలా అంటారు: (ఓ ముహమ్మద్!) నీవు భూమి నుండి మా కొరకు ఒక చెలమను ఝల్లున ప్రవహింప జేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము
أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِنْ نَخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا
లేదా! నీ కొరకు ఖర్జూరపు మరియు ద్రాక్షతోట ఏర్పడి దాని మధ్య నుండి సెలయేళ్ళు పొంగి ప్రవహింప జేయనంత వరకు
أَوْ تُسْقِطَ السَّمَاءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِيَ بِاللَّهِ وَالْمَلَائِكَةِ قَبِيلًا
లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు, ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు
أَوْ يَكُونَ لَكَ بَيْتٌ مِنْ زُخْرُفٍ أَوْ تَرْقَىٰ فِي السَّمَاءِ وَلَنْ نُؤْمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيْنَا كِتَابًا نَقْرَؤُهُ ۗ قُلْ سُبْحَانَ رَبِّي هَلْ كُنْتُ إِلَّا بَشَرًا رَسُولًا
లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు; లేదా నీవు ఆకాశంలోకి ఎక్కి పోయినా నీవు, మేము చదువగలిగే ఒక గ్రంథాన్ని అవతరింప జేయనంత వరకు; నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము." వారితో అను: నా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశహరునిగా పంపబడిన మానవుడను మాత్రమే

Choose other languages: