Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #105 Translated in Telugu

وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَىٰ مَسْحُورًا
మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము. ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను
قَالَ لَقَدْ عَلِمْتَ مَا أَنْزَلَ هَٰؤُلَاءِ إِلَّا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ بَصَائِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَا فِرْعَوْنُ مَثْبُورًا
(మూసా) అన్నాడు: నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను
فَأَرَادَ أَنْ يَسْتَفِزَّهُمْ مِنَ الْأَرْضِ فَأَغْرَقْنَاهُ وَمَنْ مَعَهُ جَمِيعًا
అప్పుడు అతడు (ఫిర్ఔన్) వారిని భూమి (ఈజిప్టు) నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని (ఫిర్ఔన్ ను) మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచి వేశాము
وَقُلْنَا مِنْ بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا
మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము
وَبِالْحَقِّ أَنْزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا
మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము

Choose other languages: