Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #108 Translated in Telugu

وَقُلْنَا مِنْ بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا
మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము
وَبِالْحَقِّ أَنْزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا
మరియు మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సత్యంతో అవతరింపజేశాము. మరియు ఇది సత్యంతోనే అవతరించింది. (ఓ ప్రవక్తా!) మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము
وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنْزِيلًا
మరియు నీవు ప్రజలకు నెమ్మది నెమ్మదిగా చదివి వినిపించాలని, మేము ఖుర్ఆన్ ను విభజించి, క్రమక్రమంగా అవతరింపజేశాము
قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِنْ قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا
వారితో అను: మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు
وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِنْ كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا
మరియు ఇలా అంటారు: మా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, మా ప్రభువు వాగ్దానం పూర్తయి తీరుతుంది

Choose other languages: