Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #111 Translated in Telugu

قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِنْ قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا
వారితో అను: మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు
وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِنْ كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا
మరియు ఇలా అంటారు: మా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, మా ప్రభువు వాగ్దానం పూర్తయి తీరుతుంది
وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩
మరియు వారు ఏడుస్తూ, తమ ముఖాల మీద పడి పోతారు. మరియు వారి వినమ్రత మరింత అధికమవుతుంది
قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا
వారితో అను: మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) ! అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమాజ్ లో నీవు చాలా గట్టిగా గానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు
وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُنْ لَهُ وَلِيٌّ مِنَ الذُّلِّ ۖ وَكَبِّرْهُ تَكْبِيرًا
ఇంకా ఇలా అను: సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటు వంటి అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి

Choose other languages: