Quran Apps in many lanuages:

Surah Al-Hijr Ayahs #55 Translated in Telugu

وَنَبِّئْهُمْ عَنْ ضَيْفِ إِبْرَاهِيمَ
మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు
إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنْكُمْ وَجِلُونَ
వారు అతని వద్దకు వచ్చి: నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది
قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ
వారు జవాబిచ్చారు: నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము
قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَنْ مَسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ
(ఇబ్రాహీమ్) అన్నాడు: మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు
قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِنَ الْقَانِطِينَ
వారన్నారు: మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు

Choose other languages: