Quran Apps in many lanuages:

Surah Al-Hadid Ayahs #26 Translated in Telugu

مَا أَصَابَ مِنْ مُصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنْفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِنْ قَبْلِ أَنْ نَبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం
لِكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగి పోరాదని. మరియు అల్లాహ్ బడాయీలు చెప్పుకునేవారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు
الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ۗ وَمَنْ يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
ఎవరైతే స్వయంగా లోభత్వం చూపుతూ ఇతరులను కూడా లోభత్వానికి పురికొలుపుతారో మరియు ఎవడైతే (సత్యం నుండి) వెనుదిరుగుతాడో, వాడు (తెలుసుకోవాలి) నిశ్చయంగా, అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడని
لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنْزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ۖ وَأَنْزَلْنَا الْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ مَنْ يَنْصُرُهُ وَرُسُلَهُ بِالْغَيْبِ ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ
వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్ప శక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరియు (ఇదంతా) అల్లాహ్ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలశాలి, సర్వశక్తిమంతుడు
وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتَابَ ۖ فَمِنْهُمْ مُهْتَدٍ ۖ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ
మరియు వాస్తవంగా మేము నూహ్ ను మరియు ఇబ్రాహీమ్ ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచాము. కాని వారి సంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు

Choose other languages: