Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #254 Translated in Telugu

وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు
فَهَزَمُوهُمْ بِإِذْنِ اللَّهِ وَقَتَلَ دَاوُودُ جَالُوتَ وَآتَاهُ اللَّهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهُ مِمَّا يَشَاءُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَفَسَدَتِ الْأَرْضُ وَلَٰكِنَّ اللَّهَ ذُو فَضْلٍ عَلَى الْعَالَمِينَ
ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు
تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
ఇవన్నీ అల్లాహ్ సందేశాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు (మా) సందేశహరులలో ఒకడవు
تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِنْهُمْ مَنْ كَلَّمَ اللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِنْ بَعْدِهِمْ مِنْ بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُمْ مَنْ آمَنَ وَمِنْهُمْ مَنْ كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلُوا وَلَٰكِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) మాట్లాడాడు. మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు)కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్) సహాయంతో బలపరిచాము. మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنْفِقُوا مِمَّا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ يَوْمٌ لَا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! ఏ బేరం గానీ, స్నేహం గానీ, సిఫారసు గానీ పనికిరాని దినం రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి. మరియు సత్యతిరస్కారులు, వారే! దుర్మార్గులు

Choose other languages: