Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #244 Translated in Telugu

وَالَّذِينَ يُتَوَفَّوْنَ مِنْكُمْ وَيَذَرُونَ أَزْوَاجًا وَصِيَّةً لِأَزْوَاجِهِمْ مَتَاعًا إِلَى الْحَوْلِ غَيْرَ إِخْرَاجٍ ۚ فَإِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِي مَا فَعَلْنَ فِي أَنْفُسِهِنَّ مِنْ مَعْرُوفٍ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
మరియు మీలో మరణించిన వారు భార్యలను వదలిపోతే, వారు తమ భార్యలకు ఒక సంవత్సరపు భరణపు ఖర్చులు ఇవ్వాలనీ, వారిని ఇంటి నుండి వెడలగొట్ట వద్దనీ వీలునామా వ్రాయాలి. కానీ వారు తమంతట తామే వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా మీపై పాపం లేదు మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
وَلِلْمُطَلَّقَاتِ مَتَاعٌ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
మరియు విడాకులివ్వబడిన స్త్రీలకు ధర్మప్రకారంగా భరణపు ఖర్చులు ఇవ్వాలి. ఇది దైవభీతి గలవారి విధి
كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను (ఆయత్ లను) మీకు స్పష్టంగా తెలుపుతున్నాడు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا مِنْ دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్ వారితో: మరణించండి!" అని అన్నాడు కాని తరువాత వారిని బ్రతికించాడు. నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు
وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
మరియు మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు, అని తెలుసుకోండి

Choose other languages: