Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #78 Translated in Telugu

وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ عَادٍ وَبَوَّأَكُمْ فِي الْأَرْضِ تَتَّخِذُونَ مِنْ سُهُولِهَا قُصُورًا وَتَنْحِتُونَ الْجِبَالَ بُيُوتًا ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
మరియు ఆయన, ఆద్ జాతి వారి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరచిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకున్నారు. మరియు కొండలను తొలచి గృహాలను నిర్మించుకుంటున్నారు. కావున అల్లాహ్ అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు భూమిపై అనర్థాన్ని, కల్లోల్లాన్ని రేకెత్తించకండి!" అని అన్నాడు
قَالَ الْمَلَأُ الَّذِينَ اسْتَكْبَرُوا مِنْ قَوْمِهِ لِلَّذِينَ اسْتُضْعِفُوا لِمَنْ آمَنَ مِنْهُمْ أَتَعْلَمُونَ أَنَّ صَالِحًا مُرْسَلٌ مِنْ رَبِّهِ ۚ قَالُوا إِنَّا بِمَا أُرْسِلَ بِهِ مُؤْمِنُونَ
(సాలిహ్) జాతి వారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిశ్చయంగా తెలుసా? దానికి వారు: మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందేశాన్ని విశ్వసిస్తున్నాము." అని జవాబిచ్చారు
قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا بِالَّذِي آمَنْتُمْ بِهِ كَافِرُونَ
ఆ అహంకారులన్నారు: మీరు విశ్వసించిన దానిని మేము నిశ్చయంగా తిరస్కరిస్తున్నాము
فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا يَا صَالِحُ ائْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِينَ
ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: ఓ సాలిహ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా
فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు

Choose other languages: