Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #47 Translated in Telugu

وَنَزَعْنَا مَا فِي صُدُورِهِمْ مِنْ غِلٍّ تَجْرِي مِنْ تَحْتِهِمُ الْأَنْهَارُ ۖ وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِيَ لَوْلَا أَنْ هَدَانَا اللَّهُ ۖ لَقَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۖ وَنُودُوا أَنْ تِلْكُمُ الْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారమ కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!" అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే
وَنَادَىٰ أَصْحَابُ الْجَنَّةِ أَصْحَابَ النَّارِ أَنْ قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُمْ مَا وَعَدَ رَبُّكُمْ حَقًّا ۖ قَالُوا نَعَمْ ۚ فَأَذَّنَ مُؤَذِّنٌ بَيْنَهُمْ أَنْ لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
మరియు స్వర్గవాసులు, నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు: మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా, సత్యమైనదిగా పొందాము. ఏమీ? మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా? వారు జవాబిస్తారు: అవును!" అప్పుడు ప్రకటించే వాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: దుర్మార్గులపై అల్లాహ్ శాపం (బహిష్కారం) ఉంది
الَّذِينَ يَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُمْ بِالْآخِرَةِ كَافِرُونَ
ఎవరైతే (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో! అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించినవారు
وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى الْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّا بِسِيمَاهُمْ ۚ وَنَادَوْا أَصْحَابَ الْجَنَّةِ أَنْ سَلَامٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ
మరియు ఆ ఉభయ వర్గాల మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది. దాని ఎత్తైన ప్రదేశాల మీద కొందరు ప్రజలు ఉంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి గుర్తులను బట్టి తెలుసుకుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి: మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించలేదు, కాని దానిని ఆశిస్తున్నారు
وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు

Choose other languages: