Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #50 Translated in Telugu

وَبَيْنَهُمَا حِجَابٌ ۚ وَعَلَى الْأَعْرَافِ رِجَالٌ يَعْرِفُونَ كُلًّا بِسِيمَاهُمْ ۚ وَنَادَوْا أَصْحَابَ الْجَنَّةِ أَنْ سَلَامٌ عَلَيْكُمْ ۚ لَمْ يَدْخُلُوهَا وَهُمْ يَطْمَعُونَ
మరియు ఆ ఉభయ వర్గాల మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది. దాని ఎత్తైన ప్రదేశాల మీద కొందరు ప్రజలు ఉంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి గుర్తులను బట్టి తెలుసుకుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి: మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించలేదు, కాని దానిని ఆశిస్తున్నారు
وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు
وَنَادَىٰ أَصْحَابُ الْأَعْرَافِ رِجَالًا يَعْرِفُونَهُمْ بِسِيمَاهُمْ قَالُوا مَا أَغْنَىٰ عَنْكُمْ جَمْعُكُمْ وَمَا كُنْتُمْ تَسْتَكْبِرُونَ
మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: మీరు కూడ బెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు, మీకు ఏమైనా లాభం చేకూర్చాయా
أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنْتُمْ تَحْزَنُونَ
వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.` అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): `మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా
وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ
మరియు నరకవాసులు స్వర్గవాసులతో: కొద్ది నీళ్ళో లేక అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపుకు విసరండి." అని అంటారు. (దానికి స్వర్గవాసులు): నిశ్చయంగా అల్లాహ్! ఈ రెండింటినీ సత్యతిరస్కారులకు నిషేధించి వున్నాడు." అని అంటారు

Choose other languages: