Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #69 Translated in Telugu

قُلْ هُوَ الْقَادِرُ عَلَىٰ أَنْ يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِنْ فَوْقِكُمْ أَوْ مِنْ تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُمْ بَأْسَ بَعْضٍ ۗ انْظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ
ఇలా అను: ఆయన మీ పైనుండి గానీ, లేదా మీ పాదాల క్రింది నుండి గానీ, మీపై ఆపద అవతరింప జేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు; మరియు మిమ్మల్ని తెగలు తెగలుగా చేసి, పరస్పర కలహాల రుచి చూప గలిగే (శక్తి కూడా) కలిగి ఉన్నాడు." చూడు! బహుశా వారు (సత్యాన్ని) గ్రహిస్తారోమోనని, మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో
وَكَذَّبَ بِهِ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ۚ قُلْ لَسْتُ عَلَيْكُمْ بِوَكِيلٍ
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలా అను: నేను మీ కొరకు బాధ్యుడను (కార్యసాధకుడను) కాను
لِكُلِّ نَبَإٍ مُسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ
ప్రతి వార్తకు (విషయానికి) ఒక గడువు నియమింపబడి ఉంది. మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు
وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వారు వృథా మాటలు (దూషణలు) చేస్తూ ఉండటం నీవు చూస్తే, వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారి నుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ షైతాన్ నిన్ను మరపింపజేస్తే! జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలసి కూర్చోకు
وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَلَٰكِنْ ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏ మాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం, (విశ్వాసుల ధర్మం). బహుశా, వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు

Choose other languages: